Niśi lō nasa · a fretting in the night
చీకటిలో పరుగుతీసే చింతలు
నన్ను గుచ్చి నొచ్చి
నా మనసుని కమిలించి
భవిష్యత్తుపై ఆలోచనలు
నిద్ర నుండి దూరం చేసి
ఎప్పుడో ముందున్న కష్టాలు
గుండెను బిగుసు చేసి
అడుగే వేయలేని పరిస్థితులు
భుజములపై భారం వేసి
ఆ చీకటిలో, ఆ భారంతో
పరాక్రమం చూపు, ధైర్యం తో సాగు
అని వెన్ను తట్టెను